త్రిపుర డీజీపీ ఆత్మహత్య?.. ఆఫీసులో విగత జీవిగా కనిపించిన అధికారి
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కర్ అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో సోమవారం విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆయనను గోవింద్ వల్లభ్ పంత్ దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు ఆయనను బతికించే ప్రయత్నాలు చేశారు.
అగర్తలా: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కర్ అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో సోమవారం విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆయనను గోవింద్ వల్లభ్ పంత్ దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు ఆయనను బతికించే ప్రయత్నాలు చేశారు. కాని ఫలితం లేకపోవడంతో ఆయన మరణించినట్టు ప్రకటించారు. ‘ఆయనను మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చినప్పుడు మా వైద్యులు పరీక్షించారు.
పల్స్, రక్తపోటు, ఉష్ణోగ్రత ఇతర ప్రాణధార సంకేతాలేవీ కనిపించలేదు. వెంటనే ఎమర్జెన్సీ యూనిట్లో సీపీఆర్ చేశాం. అయినా ఫలితం లేకపోవడంతో ఆయన మరణించినట్టు అధికారికంగా ప్రకటించాం’ అని సీనియర్ డాక్టర్ ప్రదీప్ భౌమిక్ అన్నారు. శవ పరీక్ష తర్వాతే మరణ కారణం వెల్లడించగలమని తెలిపారు. ధన్కర్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

