చండీగఢ్: పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అక్తర్ మృతి కేసు అనూహ్య మలుపు తీసుకుంది. చనిపోక ముందు అక్తర్ మాట్లాడిన వీడియో ఒకటి బయటకు రావడంతో, కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. ‘నా తండ్రికి, నా భార్యతో అఫైర్ ఉంది. నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు’ అంటూ అక్తర్ మాట్లాడిన వీడియో(ఆగస్టు 27నాటిది) బయటకు వచ్చింది. హర్యానా పోలీసులు మాజీ డీజీపీ ముస్తఫా, ఆయన భార్య, మాజీ మంత్రి రజియా సుల్తానాలపై కేసు నమోదుచేశారు. అక్టోబర్ 16న పంచకులలో చనిపోయిన అక్తర్ కేసులో వస్తున్న ఆరోపణల్ని మాజీ డీజీపీ, ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. డ్రగ్స్‌కు బానిసగా మారిన అతడు చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు.