హైదరాబాద్: పార్లమెంట్లో ముస్లిం వ్యక్తిపై దాడి జరిగే రోజు దగ్గర్లోనే ఉందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) అన్నారు. బీఎస్పీ ఎంపీ దనిష్ అలీపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓవైసీ ఇలా స్పందించారు. దేశవ్యాప్తంగా గోవుల స్మగ్లింగ్‌తో పాటు ఇతర ఘటనల్లో సామూహిక దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా ఓ బీజేపీ ఎంపీ.. ముస్లిం ఎంపీని దూషించిన తీరు ప్రజలంతా చూశారని ఆయన గుర్తు చేశారు. తన మాటల్ని గుర్తుంచుకోవాలని, పార్లమెంట్లో ముస్లింపై సామూహిక దాడి జరుగుతుందని, ఆ రోజు దగ్గర్లోనే ఉందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాశ్ అని ప్రధాని మోదీ స్లోగన్స్ ఇస్తున్నారని, కానీ ఆ స్లోగన్ ఆచరణలో లేదన్నారు.
#WATCH | Hyderabad, Telangana: AIMIM chief Asaduddin Owaisi “We see that a BJP MP abuses a Muslim MP in the Parliament. People are saying that he should not have said all this in the Parliament, they are saying that his tongue was bad. This is the representative of the people for… pic.twitter.com/2H9KH7VSuZ
— ANI (@ANI) September 24, 2023
ముస్లిం ఎంపీని బెదిరిస్తూ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటల్ని ఆరబిక్ భాషలో తర్జుమా చేసి యూఏఈకి ప్రధాని మోదీ పంపిస్తారా అని ఓవైసీ ప్రశ్నించారు. హర్యానాలో జునైద్, నసీర్ హత్యల గురించి ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, ఎంఐఎం అభ్యర్థులు లేని చోట సీఎం కేసీఆర్‌కు సపోర్టు ఇవ్వాలని ఓవైసీ తన పార్టీ కార్యకర్తల్ని, ప్రజలను కోరారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ఆయన సవాల్ విసిరారు.