పెండ్లి పత్రికపై పుట్టినతేదీ మస్ట్!.. మహారాష్ట్ర ప్రభుత్వం యోచన
బాల్యవివాహాలను నిరోధించేందుకు పెండ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా నియమం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
ముంబై: బాల్యవివాహాలను నిరోధించేందుకు పెండ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా నియమం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. బుధవారం శాసనసభలో బీజేపీ సభ్యుడు అతుల్ భత్కల్కర్ అడిగిన ప్రశ్నకు మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అదితి తట్కరే సమాధానమిస్తూ పెండ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ప్రచురించే విధానం ఇప్పటికే రాజస్థాన్లో అమల్లో ఉందని, ఆ విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఆ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.
ఇటీవలి సర్వేల ప్రకారం మహారాష్ట్రలో బాల్యవివాహాల రేటు తగ్గింది. 2019-21 సర్వేలో 21.9 శాతంగా ఉన్న బాల్య వివాహాల రేటు 2023-24 సర్వే నాటికి 19.6 శాతానికి దిగివచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

