Diabetes | న్యూఢిల్లీ: టైప్-2 మధుమేహంతో బాధపడేవారు క్యారట్లను తినడం వల్ల మేలు జరుగుతుందని డెన్మార్క్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. సదరన్ డెన్మార్క్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తేలాయి.
బ్లడ్ సుగర్ స్థాయిలను నియంత్రించడానికి, పేగుల్లో బ్యాక్టీరియాను ఆరోగ్యగంగా, సమతుల్యతతో ఉంచడానికి అవసరమయ్యే శారీరక శక్తిని క్యారట్లు వృద్ధి చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. క్యారట్లు మధుమేహానికి సహజ సిద్ధమైన, దుష్ఫలితాలు లేని చికిత్సగా ఉపయోగపడతాయని వివరించారు. క్యారట్ పొడిని తిన్న ఎలుకలు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను ఎక్కువ సమర్థవంతంగా నియంత్రించగలిగినట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వారు వివరించారు.