Cyclone Dana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low pressure area) క్రమంగా బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా దూసుకొస్తోందని, క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాన్ (Cyclone) గా మారనుందని పేర్కొంది. ఈ తుఫానుకు దానా తుఫాన్ (Dana cyclone) గా నామకరణం చేశారని వెల్లడించింది.
ఈ దానా తుఫాన్ పూరీ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో రాగల మూడు నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఈ నెల 24 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.