Uttar Pradesh | లక్నో, ఏప్రిల్ 23: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకున్నది. తుపాకీ గురిపెట్టి.. ఓ దళిత మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నాలుగేండ్ల కుమారుడి ఎదుటే బాధిత మహిళపై నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మెయిన్‌పురి జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దళిత మహిళ భర్త తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉండటాన్ని నిందితుడు ఆసరాగా చేసుకొని, ఆమెకు రూ.20వేలు రుణంగా ఇస్తానని నమ్మబలికాడు. వంతెన వద్ద తన కుమారుడితో నిలుచున్న ఆమెను మోటార్ బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎదురు తిరిగితే తుపాకీతో ఇద్దర్నీ కాల్చిపారేస్తానని బెదిరించాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు, బీఎన్ఎస్ సెక్షన్ కింద నిందితుడిపై కేసు నమోదైంది.