భోపాల్: మధ్యప్రదేశ్లోని విజయ్పూర్ శాసన సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ తర్వాత హింస చెలరేగింది. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత గోహ్తా గ్రామంలోని దళితుల ఇండ్లకు దుండగులు నిప్పు పెట్టారు. రాళ్లు విసిరి, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో భయకంపితులైన గ్రామస్థులు సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందారు. ఎన్నికల ముందే హింస ప్రారంభమైందని.. కొందరు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గ్రామస్థులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు.