రాజ్కోట్ : గుజరాత్లోని అమ్రేలీ జిల్లా జునా జంజరియా గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ కాంతి చౌహాన్ (దళితుడు) శుక్రవారం పాఠశాలలో విషం తాగి, ఆ విషయాన్ని ఆయన తన భార్యకు తెలిపారు. అయితే ఆయన దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అంతకుముందు ఆయన విడుదల చేసిన వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం, కాంతి చౌహాన్ ను ఆ గ్రామ సర్పంచ్ ముకేశ్ బోరిసాగర్, పలువురు టీచర్లు తీవ్రంగా వేధించి, కులపరమైన మాటలతో అవమానించినట్లు తెలుస్తోంది.