న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులు 8వ వేతన సంఘం గురించి తీవ్రంగా చర్చిస్తున్న సమయంలో, బేసిక్ పేలో డీఏ, డీఆర్‌లను విలీనం చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఎంపీ ఆనంద్ బదౌరియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ వివరణ ఇచ్చారు.
ప్రభుత్వోద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు 50 శాతం డీఏను బేసిక్ పేలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.