D Raja : ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పందించారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్ధానం చేసిన వ్యాఖ్యలపై ఈడీ, ఇతర ఏజెన్సీలు సమాధానం ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఈ కేసును అసలు విస్తృత ధర్మాసనానికి ఎందుకు నివేదించిందనేది అర్ధం చేసుకోవాలని అన్నారు. అరెస్ట్ సరైందా కాదా అనే విషయంలో న్యాయపరమైన, చట్టబద్ధమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని రాజా పేర్కొన్నారు.
ఇక ఎల్ఎల్బీ కరిక్యులంలో మనుస్మృతిని చేర్చాలనే ప్రతిపాదనపై స్పందిస్తూ మనుస్మృతిని బోధించాలని వారు ఎలా నిర్ణయానికి వచ్చారని ఢిల్లీ వర్సిటీ వీసీ, సంబంధిత ఫ్యాకల్టీని ప్రశ్నించాలని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకునే అధికారం వారికి ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. రాజ్యాంగ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని, అసలు మనుస్మృతిని బోధించాలని వారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారనేదానిపై ముందుగా ఢిల్లీ యూనివర్సిటీ స్పందించాలని చెప్పారు.
కాగా, మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్ (interim bail) మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పూర్తిస్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది.
Read More :
Kalki 2898 AD OTT | ‘కల్కి 2898 ఏడీ’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు చేశారా?