Kalki 2898 AD OTT | ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ `కల్కి 2898 ఏడీ. ది గ్రేట్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, హీరోయిన్ దీపిక పదుకొనే వంటి గొప్ప యాక్టర్స్ నటించిన ఈ చిత్రం జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 39 సంవత్సరాల తరువాత ఇండియన్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కలిసి నటించడంతో ఈ చిత్రం విలువ ఇంకా పెరిగింది. సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజై రెండు వారాలు పూర్తిచేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా హాలివుడ్ స్థాయిలో ఉన్న ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని చూసి ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు.
ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉన్న బుజ్జి కారు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు `కల్కి 2898 ఏడీ` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఓటీటీలో మొదటగా ఈ సినిమాను హిందీ భాషలో విడుదల చేసి.. ఆ తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో అమోజాన్ ప్రైమ్ ద్వారా ఆగష్టు 15న రిలీజ్ అవుతున్నట్లు సమాచారం.
Also Read..