Sardar 2 | కథను నమ్మి సినిమాలు చేసే స్టార్ యాక్టర్లలో ఒకరు కోలీవుడ్ నటుడు కార్తీ (Karthi). ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలతోపాటు క్యూరియాసిటీ పీక్ స్టేజ్‌లో ఉంటుందని ప్రత్యేకించి చెప్పవవసరం లేదు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తి టైటిల్ రోల్లో నటించిన సర్దార్ బాక్సాఫీస్ ను షేక్ చేసిందని తెలిసిందే. ఇప్పుడిక సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2) కూడా వచ్చేస్తుంది.
మిషన్ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్ 2 ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం క్రేజీ వార్త రానే వచ్చింది. సర్దార్ 2 పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. జులై 15 నుంచి సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలియజేశారు మేకర్స్. ఈ మూవీ పూజా సెర్మనీ స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
తాజా టాక్ ప్రకారం చెన్నైలో వేసిన భారీ సెట్లో సర్దార్ 2 షూటింగ్ కొనసాగనుంది. సీక్వెల్‌ను కథానుగుణంగా కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాలో చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని ఇన్సైడ్ టాక్.
సర్దార్ 2 పూజా కార్యక్రమం…
The auspicious pooja for #Karthi starrer #Sardar2 took place recently and the shooting of the film is scheduled to start on July 15th 2024 in grand sets in Chennai.@Karthi_Offl @psmithran @Prince_Pictures @lakku76 @venkatavmedia @thisisysr @george_dop @rajeevan69 @dhilipaction… pic.twitter.com/UgpFVpGZXu
— BA Raju’s Team (@baraju_SuperHit) July 12, 2024
Bharateeyudu 2 Review | కమల్ హాసన్ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..? శంకర్ భారతీయుడు 2 ఎలా ఉందంటే..!
Maharaja | ఓటీటీలోకి విజయ్ సేతుపతి మహారాజ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
మిషన్ కంబోడియా…
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022