ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 15:09:12

అహ్మదాబాద్‌లో 57గంటల పాటు కర్ఫ్యూ

అహ్మదాబాద్‌లో 57గంటల పాటు కర్ఫ్యూ

అహ్మదాబాద్‌ : కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అహ్మదాబాద్‌ నగరంలో మహమ్మారి నియంత్రణ కోసం కఠిన చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి 57 గంటల పాటు కర్ఫ్యూ విధించాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. సంపూర్ణ కర్ఫ్యూ నేపథ్యంలో కేవలం పాలు, ఔషధ దుకాణాలు మాత్రమే తెరిచి ఉండనున్నాయి. అహ్మదాబాద్‌లో మహమ్మారి సంబంధిత కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం స్పెషల్‌ డిప్యూటీ ఆఫీసర్‌గా అదనపు చీఫ్‌ సెక్రెటరీ (అటవీశాఖ, పర్యావరణం) రాజీవ్‌కుమార్‌ గుప్తాకు బాధ్యతలు అప్పగించింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గుజరాత్‌ సర్కారు నవంబర్‌ 23 నుంచి రాష్ట్రంలో మాధ్యమిక పాఠశాల, కళాశాలలను ప్రారంభించాలనే ముందస్తు నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, గత కొద్ది నెలలుగా సుమారు 140 రోజువారీ కేసులు రికార్డు అవుతుండగా.. ప్రస్తుతం 200పైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు 230 మందికి వైరస్‌ సోనికినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.