Saffron Cultivation | ఇండోర్: మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రైతు అనిల్ జైశ్వాల్ చేసిన సాహసం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. కుటుంబంతో సరదాగా కశ్మీర్‌కు వెళ్లిన ఆయన కుంకుమ పువ్వు పంటపై మక్కువ పెంచుకున్నారు. తన ఇంట్లో 320 చదరపు అడుగుల విస్తీర్ణంలోని గదిలో కశ్మీర్ వాతావరణాన్ని సృష్టించారు. ఉష్ణోగ్రత, తేమ, కాంతి, కార్బన్ డయాక్సైడ్ వంటివాటిని నియంత్రించారు. కశ్మీరు నుంచి కుంకుమ పువ్వు మొగ్గలను తెప్పించారు. సెప్టెంబరులో ఏరోపోనిక్స్ టెక్నాలజీతో కుంకుమ పువ్వు సాగు చేశారు. అక్టోబరులో 2 కిలోల వరకు దిగుబడి వచ్చింది.