CUET | న్యూఢిల్లీ : ఈ నెల 8 నుంచి జరగాల్సిన ది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ)-యూజీ పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పరీక్ష జరిగే తాజా తేదీలను త్వరలో ప్రకటించనున్నట్టు పేర్కొన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించి సీయూఈటీ-యూజీకి ఈ సంవత్సరం 13.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది.