న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ భద్రతను కేంద్రం మరింత కట్టుదిట్టం చేయనుంది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ వీఐపీ వింగ్‌కు సంబంధించిన మహిళా సెక్యూరిటీని వారికి నియమించినున్నట్లు విశ్వసనీయ సమాచారం. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను రెండేండ్ల క్రితం కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు స్పీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ ప్లస్ కేటగిరి కింద రక్షణ కల్పిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా సోనియా, ప్రియాంక, గరుశరణ్ కౌర్‌కు సీఆర్పీఎఫ్ మహిళా సెక్యూరిటీ కల్పించనున్నట్లు సమాచారం.
Women security personnel of CRPF VIP Wing will be deployed in protection of Congress leaders Sonia Gandhi & Priyanka Vadra Gandhi, and Gursharan Kaur, wife of former PM Manmohan Singh: Sources
— ANI (@ANI) December 22, 2021