న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) జవాను మోతీ రామ్ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఆయనను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్‌లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు వచ్చే నెల 6 వరకు ఎన్ఐఏ కస్టడీకి ఆదేశించింది. ఎన్ఐఏ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మోతీ రామ్ 2023 నుంచి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థకు భారత దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా పంపిస్తున్నాడు.
అందుకు బదులుగా పాకిస్థానీ సంస్థ నుంచి వివిధ మార్గాల్లో నిధులు తీసుకుంటున్నాడు. ఈ ఆరోపణలు దేశ భద్రత, భారతీయులు, దేశానికి వచ్చే ప్రజల ప్రాణాలపై ప్రభావం చూపుతాయని ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది.