బీజాపూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. ఆవపల్లి – బసగూడ రూట్లో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తుండగా ఐఈడీ పేలడంతో.. ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు. జవాన్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో.. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జవాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బసగూడ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.