IED Blast | రాంచీ : జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఐఈడీ బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
జార్ఖండ్‌లోని జరైకేలా పోలీసు స్టేషన్ పరిధిలోని బాబుదేరా అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు శుక్రవారం రాత్రి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టుల కోసం గాలిస్తుండగా.. ఐఈఈ పేలింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ మహేంద్ర లష్కర్(45) తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు.. లష్కర్‌ను చికిత్స నిమిత్తం రూర్కేలా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. లష్కరే అసోం రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా, సీఆర్పీఎఫ్ 60వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.