న్యూఢిల్లీ: దేశంలోని రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడటం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ప్రీమియం రైళ్లు అయిన వందేభారత్ ఎక్స్ప్రెస్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంటున్నది. టికెట్లేని ప్రయాణికులు ఈ లగ్జరీ రైళ్లలో ఎక్కుతుండటంతో ఈ రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.
లక్నో జంక్షన్, డెహ్రాడూన్ మధ్య నడిచే వందేభారత్ రైల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణిస్తున్న వీడియో వైరల్గా మారింది. దీనిపై ప్రయాణికులు సోషల్మీడియాలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.