జ్ఞానవాపీ మసీదు దగ్గర ఒక్కసారిగా రద్దీ ఎక్కువైపోయింది. శుక్రవారం ప్రార్థనలను పురస్కరించుకొని ముస్లింలు పెద్ద మొత్తంలో తరలివచ్చారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జ్ఞానవాపీ మసీదులోకి ప్రార్థనల నిమిత్తం 30 మందిని మాత్రమే అనుమతించాలన్న నిబంధనలు ఉన్నాయి. అయినా… ఒక్కసారిగా ప్రార్థనల నిమిత్తం 700 మంది రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతను పెంచారు.
ఒక్కసారిగా 700 మంది ప్రార్థనల కోసం రావడంతో మసీదు గేట్లను పోలీసులు మూసేశారు. ఈ మసీదు కాకుండా ప్రార్థనల కోసం మరో మసీదుకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. జ్ఞానవాపీ మసీదు విషయంపై శుక్రవారం సాయంత్రం సుప్రీంలో వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక యంత్రాంగం అలర్ట్ అయ్యింది.