న్యూఢిల్లీ: మండీ బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా తడబడ్డారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై విమర్శలు చేయబోయి, సొంత పార్టీ నేత తేజస్వీ సూర్యపై విమర్శలు గుప్పించారు. ఇద్దరి పేర్ల ముందు తేజస్వీ ఉండటమే ఆమె గందరగోళానికి కారణం. ‘చెడిపోయిన యువరాజుల పార్టీ ఉంది. చంద్రునిపై ఆలుగడ్డలు పండించాలనుకున్న రాహుల్ అయినా, గూండాయిజం చేసి చేపలు తినే తేజస్వీ సూర్య అయినా’ అని ఆమె విమర్శలు చేశారు. కంగనా విమర్శలపై తేజస్వీ యాదవ్ ‘ఎవరీ మహిళ’ అంటూ ట్వీట్ చేశారు.