Crime news : నడిరోడ్డు మీద మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ముఖంపై, మెడపై, కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తూర్పు బీహార్‌లోని కతిహార్‌లో మగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న యశోదా దేవి అనే 29 ఏళ్ల మహిళ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నది. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండే ఆమె ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లి పూజ చేసి వస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 5.30 గంటలకు స్కూల్లో పూజ చేసేందుకు బయలుదేరింది.
అప్పటికే దారికాచిన నిందితుడు మధ్యలోనే యశోదను అడ్డగించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా విడువకుండా విచక్షణారహితంగా దాడిచేశాడు. కిందిపడిపోయిన వదలకుండా కడుపులో పొడిచి చంపేశాడు. అంతటితో ఆగక ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ హృదయవిధారక ఘటన స్థానికులను కలచివేసింది.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి, హతురాలికి ఆమె పెళ్లికి ముందు వివాహేతర సంబంధం ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిందితుడు యశోధ భర్తపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.