ముంబై: గోవా నుంచి ముంబైకి ఓ షిప్ వచ్చింది. అందులో 2 వేలకుపైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా ఎంతమందికి కరోనా వచ్చిందనే విషయం తేలాల్సి ఉన్నది.
కార్డెలియా అనే క్రూయిజ్ షిప్ గోవా నుంచి ముంబైకి వచ్చింది. పడవలో సిబ్బంది సహా 2016 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిని పడవలోని ఓ గదిలో ఐసోలేషన్లో ఉంచారు. ముంబై తీరానికి వచ్చిన తర్వాత.. అధికారులు క్రూయిజ్లోని అందరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ఇంకా వెల్లడవ్వాల్సి ఉంది. అప్పటివరకు పడవ నుంచి ఎవ్వరూ కిందికి దిగొద్దని అధికారులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం పడవ మార్ముగోవాలో లంగరు వేసి ఉంది.