భోపాల్: విగ్రహానికి పూలదండ వేస్తుండగా క్రేన్ లిఫ్ట్ కూలింది. (Crane Crash) దీంతో దానిలో ఉన్న ఇద్దరు నాయకులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. మహారాణా ప్రతాప్ జయంతి నేపథ్యంలో భోపాల్‌లోని విగ్రహానికి పూలమాల వేసేందుకు 66వ వార్డు కౌన్సిలర్ జితేంద్ర సింగ్ రాజ్‌పుత్ ప్రయత్నించారు. తన బంధువుతో కలిసి క్రేన్ లిఫ్ట్‌లో 20 అడుగుల ఎత్తుకు వెళ్లారు. విగ్రహం దగ్గరకు లిఫ్ట్‌ను తీసుకెళ్లాలని క్రేన్ ఆపరేటర్‌కు సూచించారు.
కాగా, మహారాణా ప్రతాప్ విగ్రహం వద్దకు క్రేన్ లిఫ్ట్ చేరగా పూలదండ వేసేందుకు జితేంద్ర సింగ్ రాజ్‌పుత్ ముందుకు వంగారు. అయితే లిఫ్ట్ వెల్డింగ్ విరిగిపోవడంతో అది కూలిపోయింది. దీంతో అందులో ఉన్న జితేంద్ర సింగ్, అతడి బంధువు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జితేంద్ర సింగ్ కాలు విరిగింది. వారిద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
भोपाल में महाराणा प्रताप की प्रतिमा पर माल्यार्पण के दौरान लिफ्ट टूटी, पार्षद घायल pic.twitter.com/yG01cbm3jP
— NaiDunia (@Nai_Dunia) June 9, 2024