హర్యానాలోని కర్నాల్ జిల్లా రైతులపై పోలీసుల లాఠీచార్జ్‌కు నిరసనగా ఇవాళ హర్యానా వ్యాప్తంగా రైతులంతా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా హర్యానాలోని పలు హైవేలను బ్లాక్ చేశారు. రోడ్ల మీద తమ నిరసనను వ్యక్తం చేశారు.
అయితే.. ఈరోజు కర్నాల్‌లో జరిగిన బీజేపీ మీటింగ్‌ను అడ్డుకోవడం కోసం.. హైవే మీద కొందరు రైతులు ట్రాఫిక్‌ను బ్లాక్ చేశారు. ట్రాఫిక్‌ను ఆపేసి.. కర్నాల్ వైపు రైతులు దూసుకెళ్లగా.. హర్యానా పోలీసులు.. వాళ్లపై లాఠీచార్జ్ చేశారు. దీంతో 10 మంది రైతుల వరకు గాయాలపాలయ్యారు. వాళ్ల తలలకు తీవ్ర గాయాలు కావడంతో వాళ్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే.. తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నాల్‌కు చెందిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్.. ఆయుష్ సిన్హా.. అక్కడి పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్న వీడియో అది. ఆ వీడియోను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
బారికేడ్లు దాటి ఏ రైతు కూడా ముందుకు వెళ్లకూడదని.. అక్కడ కాపలా కాసే పోలీసులందరికీ ఆదేశాలు జారీ చేశాడు.
ఎవరైనా కానీ.. ఎక్కడి నుంచి వచ్చినా సరే.. ఎవ్వరిని కూడా ఈ బారికేడ్లు దాటి ముందుకు పంపించకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్లు ఎవరైనా సరే.. మీ లాఠీ తీసుకొని వాళ్లను కొట్టండి. వాళ్ల తల మీద గట్టిగా కొట్టండి. దాని కోసం మీకు ఎవ్వరూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. ఒక్క నిరసనకారుడు నాకు ఇక్కడ కనిపించినా.. అతడి తల పగిలి నాకు కనిపించాలి.. వాళ్ల తలలను మీ లాఠీలతో పగులగొట్టండి.. అంటూ ఆ వీడియోలో సిన్హా చెబుతుండటాన్ని ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ప్రస్తుతం ఆ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను పోస్ట్ చేసిన వరుణ్ గాంధీ.. ఈ వీడియోను ఎడిట్ చేశారు. డీఎం అలా చెప్పి ఉండరు. ఒకవేళ ఆయన అలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే మాత్రం.. స్వతంత్ర భారతదేశంలో దీన్ని ఎవ్వరూ ఒప్పుకోరు. మన దేశ పౌరులపై అలా విరుచుకుపడటం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. అని ఆయన ట్వీట్ చేశారు.
I hope this video is edited and the DM did not say this… Otherwise, this is unacceptable in democratic India to do to our own citizens. pic.twitter.com/rWRFSD2FRH
— Varun Gandhi (@varungandhi80) August 28, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : రైతులపై లాఠీచార్జ్ : కాషాయ పార్టీని టార్గెట్ చేసిన కాంగ్రెస్!
Haryana Farmers : హర్యానాలో హైవేలు బ్లాక్.. పోలీసుల తీరుకు నిరసన చేపట్టిన రైతులు