న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ(Congrees Party)కి భారీ జలక్ తగిలింది. ఇండియాకు తొలి గవర్నర్ జనరల్‌గా చేసిన తొలి భారతీయుడు సీ రాజగోపాలచారి మునిమనవడు సీఆర్ కేశవన్(CR Kesavan) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేకు పంపారు. ఇన్నాళ్లూ పార్టీకి సేవ చేసే బాధ్యతల్ని కల్పించినందుకు పార్టీకి, సోనియాకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. పార్టీలో అందరితోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నట్లు చెప్పారు.
Attached herewith is my Letter of Resignation from the Indian National Congress. Jai Hind!@TamilTheHindu @dinamalarweb @dinathanthi @DinakaranNews @maalaimalar @PTTVOnlineNews @ThanthiTV @sunnewstamil @news7tamil @polimernews @News18TamilNadu @Kalaignarnews @JagranNews @lokmat pic.twitter.com/0QVlQ5ymIY
— C.R.Kesavan (@crkesavan) February 23, 2023
విదేశాల్లో విజయవంతమైన కెరీర్‌ను వదిలేసి.. దేశ సేవ కోసం ఇండియాకు వచ్చానన్నారు. జాతీయ సమగ్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో 2001లో చేరినట్లు తెలిపారు. ఆ తర్వాత తన జర్నీ చాలా ఛాలెంజింగ్‌గా సాగిందన్నారు. శ్రీపెరంబదూర్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్లో వైస్ ప్రెసిడెంట్‌గా చేశానన్నారు. ప్రసారభారతి బోర్డు సభ్యుడిగా, యూత్ కాంగ్రెస్ సభ్యుడిగా కూడా చేసినట్లు చెప్పారు.
#WATCH | A senior Congress leader demanded proof of the surgical strike, it is disheartening. I realised that my way of doing politics is not in line with the party, so I did not even join 'Bharat Jodo Yatra'. I felt I didn't belong here anymore: CR Kesavan on his resignation pic.twitter.com/OgKdUz8fZc
— ANI (@ANI) February 23, 2023
దాదాపు రెండు దశాబ్ధాలుగా పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేశానని, కానీ పార్టీలో ప్రస్తుతం విలువలు లేవని ఆరోపించారు. అందుకే తాను ఇటీవల జరిగిన భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదన్నారు. కొత్త మార్గాన్ని అన్వేషించుకోవాలని భావించానని, అందుకే పార్టీ ప్రైమరీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వేరే పార్టీలో చేరే అంశంపై ఇప్పట్లో ఏమీ చెప్పలేనన్నారు.