Pinarayi Vijayan: మాజీ సీఎం ఇంటి ముందు ఈడీ అధికారుల వాహనంపై దాడి.. వీడియో
Pinarayi Vijayan: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఇవాళ ఈడీ సోదాలు చేపట్టింది. మనీల్యాండరింగ్ కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే విజయన్ ఇంటి ముందు ఇవాళ భారీ ఎత్తున సీపీఎం కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈడీ అధికారుల వాహనాన్ని సీపీఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు.
తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం విజయన్(Pinarayi Vijayan) నివాసంలో ఇవాళ ఈడీ సోదాలు చేస్తోంది. సీఎంఆర్ఎల్ కంపెనీతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. తిరువనంతపురంలో ఉన్న విజయన్ అద్దె ఇంటి ముందు ఇవాళ భారీ ఎత్తున సీపీఎం కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. బేకరీ జంక్షన్ వద్ద ఉన్న ఆ ఇంటి ముందు .. ఈడీ వాహనాన్ని సీపీఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు. హెల్మెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, రాళ్లతో అటాక్ చేశారు. అక్కడ మోహరించిన సిబ్బందిపై దాడి చేశారు. ఈడీ సోదాలు కొనసాగిస్తున్న సమయంలో ఈ తతంగం జరిగింది.
తనిఖీలు జరుగుతున్న సమయంలో ఉదయం నుంచి విజయన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు విజయన్ ఇంటికి దూసుకొచ్చారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంటి ఆవరణలో రక్షణగా ఉన్న బలగాలపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. సీనియర్ సీపీఎం నేతలు వారిని అదుపులోకి తెచ్చారు.
విజయన్ కూతురు వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి కొచ్చిన మినరల్స్ సంస్థ నుంచి అక్రమ రీతిలో సుమారు 1.72 కోట్లు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఈడీ చర్యలు తీసుకున్నది. మొత్తం 12 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నది.
#WATCH | Keralam: Commotion outside the residence of former Chief Minister and present LoP Pinarayi Vijayan in Thiruvananthapuram, as CPI(M) workers attacked a vehicle of ED officials.
The workers are protesting against the central agency over its searches at 10 premises in… pic.twitter.com/fx7Y4xutLB
— ANI (@ANI) May 27, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

