న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని సీపీఎం గురువారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ), మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లాంటి క్రూరమైన చట్టాలను రద్దు చేస్తామని, ఉపాధి హామీ పథకానికి నిధులు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీని ఓడించి తమను బలపరచాలని విజ్ఞప్తి చేసింది.