తిరువనంతపురం: కేరళలో సీపీఎం నేత(CPM Leader)ను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన కోజికోడ్‌లోని కోయిలాండిలో జరిగింది. హత్యకు పాల్పడిన అనుమానిత వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయారు. వ్యక్తిగత కక్షల వల్లే నిందితుడి దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దాడిలో చనిపోయిన వ్యక్తిని సీపీఎం కోయిలాండి కమిటీ సెక్రటరీ పీవీ సత్యనాథన్‌గా గుర్తించారు. ఆయన వయసు 66 ఏళ్లు.
సత్యనాథన్‌ను చంపిన వ్యక్తిని అభిలాష్‌గా గుర్తించారు. అతని వయసు 33 ఏళ్లు. అతను పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. ఓ ఆలయం వద్ద జరుగుతున్న మ్యూజిక్ కచేరిని వీక్షిస్తున్న సత్యనాథన్పై అటాక్ జరిగింది. ఆ దాడిలో అతనికి నాలుగు చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లినా, అతన్ని రక్షించుకోలేకపోయారు.
నిందితుడు అభిలాష్ కూడా సీపీఎం కార్యకర్తే.