ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 12:30:03

బీహార్‌లో క‌మ్యూనిస్టుల‌ జోరు..

బీహార్‌లో క‌మ్యూనిస్టుల‌ జోరు..

హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టు పార్టీ (సీపీఐ,ఎంఎల్‌)అనూహ్యంగా 13 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. ఆ రాష్ట్రంలో సీపీఎం పార్టీ మొత్తం 19 స్థానాల్లో ఈ సారి పోటీ చేసింది.  దాంట్లో 13 స్థానాల్లో తాజా లెక్క‌ల ప్ర‌కారం ఆ పార్టీ లీడింగ్‌లో ఉన్న‌ది.  అయితే ఈసారి కూట‌మి క‌ట్టిన సీపీఎం.. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ది. 2015లో ఆ పార్టీ ఒంట‌రిగా పోటీ చేసింది.  గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం  మూడు సీట్ల‌ను మాత్ర‌మే గెలుచుకున్న‌ది. ఆ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు సీపీఎం పార్టీ 1990లో అత్యద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. ఆ ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టు మార్కిస్ట్ పార్టీ 9 సీట్లను గెలుచుకున్న‌ది. ఈసారి ఎన్డీఏ, మ‌హాగ‌ట్‌బంద‌న్ మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా ఉన్నా.. సీపీఎం కూడా అనూహ్య రీతిలో స్థానాల‌ను ద‌క్కించుకునే దిశ‌గా వెళ్తోంది.