వయనాడ్: కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా అన్నే రాజా(Annie Raja) పోటీ చేయనున్నారు. ఆమె ఇవాళ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ భాగస్వామిగా సీపీఐ పోటీలో నిలిచింది. ఇండియా బ్లాక్లో భాగస్వామ్య పార్టీలు అయిన కాంగ్రెస్, సీపీఐ.. కేరళలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారు. సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా భార్య అయిన అన్నే రాజాకు.. పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ బృందంలో సభ్యత్వం ఉన్నది.
కన్నౌర్ జిల్లాలోని ఇరిట్టిలో ఆమె జన్మించారు. సీపీఐ స్టూడెంట్ వింగ్లో ఆమె పనిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్తో పాటు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్లో ఆమె చేశారు. సీపీఐ వుమెన్ వింగ్ కన్నౌర్ జిల్లా కార్యదర్శిగా చేశారు. పార్టీలో ఆమె కీలక నేతగా ఆవిర్భవించారు. మహిళల పట్ల అకృత్యాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.
వయనాడ్ నుంచి బుధవారం రాహుల్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాల్పెట్ట పట్టణంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ 706,367 ఓట్లు సంపాదించారు.