గోవు బలి ఈద్లో భాగం కాదు!.. కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ
వచ్చే వారం జరిగే ఈద్ అల్-అధాను పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎద్దులు, ఆవులు, దూడలు, గేదెల వధపై పరిమితులు విధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కలకత్తా హైకోర్టు గురువారం తిరస్కరించింది.
- బెంగాల్ సర్కార్ జారీచేసిన ఉత్తర్వులకు సమర్థన
కోల్కతా, మే 21: వచ్చే వారం జరిగే ఈద్ అల్-అధాను పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎద్దులు, ఆవులు, దూడలు, గేదెల వధపై పరిమితులు విధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కలకత్తా హైకోర్టు గురువారం తిరస్కరించింది. గోవు బలి అనేది ఇస్లాంలో ఒక ఆవశ్యకత మత ఆచారం కాదని స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిజానికి మే13న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ 2018లో కోర్టు స్వయంగా ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడమేనని చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ పార్థ సారథి సేన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించాల్సిన, పక్కన పెట్టాల్సిన పరిస్థితి తమకు కన్పించడం లేదని పేర్కొంటూ, దానిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.
కాగా, వచ్చే వారం జరిగే బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో విచ్చలవిడిగా పశువధ జరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం జంతుబలి చట్టం కింద ఈ నెల 13న దానిపై పరిమితులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం అన్ఫిట్ అన్న ధ్రువీకరణ పత్రం లేని ఏ జంతువును కూడా వధించ రాదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

