New Excise Policy | ప్రతి లిక్కర్ బాటిల్‌పై ఒక్క రూపాయి ఆవు పన్ను.. నూతన ఎక్సైజ్ పాలసీకి ఉత్తరాఖండ్ ఆమోదం
New Excise Policy | ఉత్తరాఖండ్‌లో 2023-24కు సంబంధించిన నూతన ఎక్సైజ్ పాలసీకి అక్కడి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇవాళ క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, ఎక్సైజ్ సెక్రెటరీ హరిచంద్ర సెమ్వాల్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో 2023-24కు సంబంధించిన నూతన ఎక్సైజ్ పాలసీకి అక్కడి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇవాళ క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, ఎక్సైజ్ సెక్రెటరీ హరిచంద్ర సెమ్వాల్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్‌లోకి మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఉత్తరాఖండ్ సర్కారు ఈ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది.
ఉత్తరప్రదేశ్‌తో పోల్చితే ఉత్తరాఖండ్‌లో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో బాటిల్‌పైన రూ.150 మొదలు రూ.200 వరకు వ్యత్యాసం ఉంది. దాంతో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌లోకి భారీగా మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఈ లిక్కర్ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో కీలక మార్పు చేసింది. యూపీతో పోల్చితే మద్యం ధరల వ్యత్యాసాన్ని ఒక్కో బాటిల్‌పై రూ.20కి తగ్గించింది.
అదేవిధంగా ఉత్తరాఖండ్ నూతన మద్యం పాలసీతో ప్రభుత్వ రెవెన్యూను పెంచే మరో నియమాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి బాటిల్‌పై ఒక్క రూపాయి చొప్పున ఆవు పన్ను, క్రీడా పన్ను, మహిళ సంక్షేమ పన్నును విధించారు. అంటే మద్యం ప్రియులు ఈ మూడు పన్నులకు కలిపి ఒక్కో బాటిల్ ధరపై అదనంగా రూ.3 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఎక్సైజ్ రెవెన్యూ లక్ష్యాన్ని ఉత్తరాఖండ్ సర్కారు రూ.4 వేల కోట్లుగా నిర్దేశించుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

