Cow And Snake: పాము పడగను ముద్దాడిన ఆవు.. వీడియో వైరల్
Viral Video: పడగ విప్పిన ఓ సర్పాన్ని.. ఆవు ముద్దాడింది. ప్రేమగా తన నాలుకతో నిమిరింది. ఈ ఘటనకు చెందిన ఓవీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఆ వీడియోను పోస్టు చేశారు.
న్యూఢిల్లీ: ప్రకృతి ఎంత సంక్లిష్టమైందో చెప్పడం కష్టమే. కానీ కొన్ని సంఘటనలు మన కంటికి అద్భుతాలే అవుతాయి. నమ్మలేని కొన్ని నిజాలను బయటపెడుతుంటాయి. ప్రస్తుతం ఎక్స్ సోషల్ మీడియాలో పోస్టు అయిన ఓ వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాగుపామును ముద్దాడుతున్న ఓ ఆవు వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆవు, పాము ఆడుకుంటున్న ఆ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నంద షేర్ చేశారు.
గోధుమ రంగులో ఉన్న ఓ ఆవు.. పడగ విప్పిన ఓ నాగుతో సయ్యాటలాడుతోంది. 17 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో చూస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. సుశాంత్ నంద తన వీడియోకు కామెంట్ కూడా చేశారు. ఈ సన్నివేశాన్ని వర్ణించడం కష్టమే అని, ఇది స్వచ్ఛమైన ప్రేమకు సంకేతం అన్నట్లు ఆయన తన కామెంట్లో తెలిపారు.
Difficult to explain. The trust gained through pure love 💕 pic.twitter.com/61NFsSBRLS
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) August 3, 2023
పాముకు కిస్ ఇస్తున్న ఆవు వీడియోను చూసిన నెటిజన్లు సంబరపడిపోతున్నారు. ఆ వీడియోకు కేవలం 15 గంటల్లో మూడు లక్షల వ్యూస్ వచ్చాయి. 5వేల మంది లైక్ కొట్టాడు. ఇక కొందరు కామెంట్లతో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ప్రకృతిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు అని ఓ యూజర్ తెలిపారు. ఆ స్నేహబంధం అద్భుతమని మరో యూజర్ పేర్కొన్నారు. కొందరు మాత్రం ఆ వీడియోను ఎంత వరకు నమ్మవచ్చు అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాది ఎన్నో పశువులు పాము కాటుతో చనిపోతుంటాయని, ఇది ఎడిటింగ్ చేసిన వీడియో అని, నమ్మశక్యంగా లేదని ఓ యూజర్ అన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cow
- Forest Officer
- IFO
- Snake
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

