న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్‌పై తలోరకంగా మాట్లాడుతుండగా కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ వేవ్‌కు సంబంధించి తేదీలు వెల్లడించడం సరైంది కాదని, వైరస్ స్వభావాన్ని ఎవరూ ఊహించలేరని అన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్‌పై మాట్లాడుతూ నూతన వేరియంట్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి శాస్త్రీయ డేటా అందుబాటులో లేదని చెప్పారు.
డెల్టా వేరియంట్ నుంచి ఉత్పన్నమైన తాజా వేరియంట్ ఇంకా ఆరంభ దశలో ఉన్నందున శాస్త్రీయ డేటా వెలుగుచూడలేదన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ తీవ్రత, దీనిపై వ్యాక్సిన్ ప్రభావం వంటి సమాచారం కోసం వేచిచూడాల్సి ఉందని డాక్టర్ వీకే పాల్ అన్నారు. మరోవైపు కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఈ ఏడాది డిసెంబర్ వరకూ తలెత్తబోదని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు.