India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజూవారీ కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వేలల్లో నమోదైన పాజిటివ్ కేసులు.. తాజాగా 500 లోపే నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 51,274 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 473 కొత్త కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,49,86,934కి చేరింది. మరోవైపు యాక్టివ్ కేసులు (Active Cases) 7 వేలకు దొగొచ్చాయి. ప్రస్తుతం 7,623 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,47,472 మంది కోలుకున్నారు. 24 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,839కి ఎగబాకింది.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Chidambaram | నల్లధనం మార్చుకునేవారికి మోదీ ప్రభుత్వం రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతోంది : చిదంబరం
Arvind Kejriwal | ఆప్ మేనిఫెస్టోతోనే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం : అరవింద్ కేజ్రీవాల్
Virat Kohli | ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔట్.. కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ.. పిక్ వైరల్