ముంబై: స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ సంబంధిత ఉల్లంఘనల ఆరోపణలపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశించింది. నియంత్రణకు సంబంధించిన లోపాలు జరిగినట్లు, కుమ్మక్కు అయినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, వీటిపై న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని తెలిపింది. దర్యాప్తును తాను పర్యవేక్షిస్తానని జడ్జి తెలిపారు.
ఓ మీడియా రిపోర్టర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ ఆదేశాలను ఇచ్చారు. ఓ కంపెనీని స్టాక్ ఎక్సేంజ్‌లో మోసపూరితంగా లిస్టింగ్ చేశారని, ఇదంతా రెగ్యులేటరీ అథారిటీస్ చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల జరిగిందని తెలిపారు.