Couples Mid Air Dining | వినూత్న డైనింగ్ అనుభవాలు వివిధ కారణాలతో వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్గా గాలిలో కేబుల్స్‌పై విహరిస్తూ ఓ జంట భోజనం చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ ఇన్స్టాగ్రాం రీల్‌ను ఏకంగా 5.9 కోట్ల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు.
అవియనెట_డైవెర్టిటా అనే యూజర్ షేర్ చేసిన ఈ రీల్లో ఓ జంట టేబుల్‌కు ఎదురెదురుగా కూర్చుని కేబుల్‌పై గాలిలో విహరిస్తుండటం కనిపిస్తుంది. ఓ వ్యక్తి వారిని ప్లాట్‌ఫాం నుంచి పుష్ చేయగా మరో వ్యక్తి ఈ ఘటనను కెమెరాలో రికార్డు చేయడం చూడొచ్చు.
బ్యాక్‌గ్రౌండ్‌లో చుట్టూ కొండలు, పచ్చదనం పరుచుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటాయి. టేబుల్‌పై వైన్ గ్లాసులు, ఐస్ బకెట్లో బాటిల్‌ను అమర్చారు. వారిద్దరి కోసం కొన్ని ఆహార పదార్ధాలనూ సిద్ధం చేశారు. ఈ పోస్ట్‌కు రొమాంటిక్ డిన్నర్ అని క్యాప్షన్ ఇచ్చారు.
Read More :