Pawan Kalyan | ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు కావాల్సింది హరీష్‌శంకరే.. ఎందుకంటే !
Pawan Kalyan | టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన (Pawan Kalyan) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు సినిమాల పరంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ప్రజాప్రతినిధిగా చట్ట సభల్లోకి ఎంట్రీ ఇచ్చి జనాలకు సేవల చేయాలనే లక్ష్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్‌కు గత ఎన్నికల్లో మాత్రం ఏపీ ఓటర్లు తీవ్ర నిరాశనే మిగిల్చారు.
Pawan Kalyan | ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జర్నీ సాగించడమంటే కష్టమైన పనే. ఇప్పుడిదే టాస్క్‌ను ఛేజ్ చేసే పనిలో ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) . ఈ స్టార్ హీరోకు సినిమాల పరంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ప్రజాప్రతినిధిగా చట్ట సభల్లోకి ఎంట్రీ ఇచ్చి జనాలకు సేవల చేయాలనే లక్ష్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్‌కు గత ఎన్నికల్లో మాత్రం ఏపీ ఓటర్లు తీవ్ర నిరాశనే మిగిల్చారు.
గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓటమి పాలయినా.. ఓటమిని లెక్కచేయకుండా ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో దూకుడుగా 2024 ఎన్నికలకు రెడీ అవుతున్నారు జనసేన చీఫ్. సిల్వర్ స్క్రీన్‌పై అగ్రెసివ్‌గా కనిపించే పవన్ కల్యాణ్‌ను చూసి అభిమానులు కేకలు, ఈలలు, కేరింతలతో ఎంజాయ్ చేస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. అయితే తన పొలిటికల్ జర్నీలో కూడా సినిమాల్లో చూపించే దూకుడును ప్రదర్శించడం కారణంగానే రాజకీయాల్లో ఆశించిన స్థానాన్ని అందుకోవడంలో విఫలమవుతుందంటున్నారు పలువురు సినీ, రాజకీయ విశ్లేషకులు.
ఇదిలా ఉంటే మొదట సినిమాలకు బ్రేక్ తీసుకోవాలనుకున్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత అభిమానులను దృష్టిలో పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ స్టార్ హీరో చేతిలో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కల్యాణ్ మ్యానరిజాన్ని తాజా పరిస్థితులకు (ఏపీ రాజకీయాలు) అనుగుణంగా ఎలివేట్ చేస్తూ.. డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కట్ చేసిన Bhagats blaze ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అని తెలిసిందే. తాజా వీడియోలో పవన్ కల్యాణ్.. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్దీ.. ఖచ్చితంగా గుర్తు పెట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం అంటూ తనదైన స్టైల్ డైలాగ్ డెలివరీతో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. జనసేనపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న పార్టీలపై కౌంటర్ అటాక్‌గా ఈ సైటైరికల్ డైలాగ్స్ రాశాడని అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు కావాల్సింది క్లాస్ టచ్ ఉండే డైలాగ్స్ రాసే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాదని, మాస్ టచ్‌తో జనాలను ఆలోచింపజేసే హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ కావాలని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ పొలిటికల్ జర్నీకి ఎలా ఉపయోగపడుతుందోనని ఇండస్ట్రీ ప్రముఖులతోపాటు సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .
Bhagats Blazeపై ఓ లుక్కేయండి మరి..
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

