న్యూఢిల్లీ : ఓ జంట తమ బాబును నిద్ర నుంచి లేపి అతడితో గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేయించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకూ కోటి మందికి పైగా వీక్షించారు. గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేయించేందుకు తమ కొడుకును వారు నిద్రలేపడంతో కొందరు నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది.
ఇన్స్టాగ్రాం వీడియో కోసం బాలుడిని నిద్ర లేపుతారా మీకిదేం బుద్ధి అంటూ విరుచుకుపడ్డారు. వైరల్ వీడియోలో రూంలో ఒ జంట గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేస్తుండటం కనిపించింది. లాంజ్‌లో నిద్రిస్తున్న బాలుడిని లేపి అతడి రియాక్షన్ పసిగట్టేందుకు జంట ప్రయత్నించింది. తనను ఎందుకు నిద్రలేపారో అర్ధం కాని బాలుడు కొద్దిసేపు వారి డ్యాన్స్‌ను అలా చూస్తుండిపోయాడు.
ఓ వీడియో కోసం తన తల్లితండ్రులు డ్యాన్స్ చేస్తున్నారని అర్ధం చేసుకున్న బాలుడు ఆపై తాను కాలు కదిపాడు. అసలు ఇలా ఎవరినీ అర్ధంతరంగా నిద్ర నుంచి లేపకండి.ఇది అసౌకర్యం కలిగించడంతో పాటు తలనొప్పికీ దారితీస్తుందని ఓ యూజర్ పేరెంట్స్‌కు బుద్ధిచెప్పాడు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో అప్డేట్ చేసే పేరెంట్స్ మరోవైపు పిల్లలు మారిపోయారని వాపోతుంటారని మరో యూజర్ మండిపడ్డారు.