Supreme Court: 25 ఏళ్లు దూరంగా ఉండి.. విడాకులు కోరిన జంట.. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే
supreme court: ఆ ఇద్దరి మధ్య బంధం ముగిసిపోవాలని, ఎందుకుంటే వాళ్లను కలిపి ఉంచడం క్రూరత్వం అవుతుందని, సుదీర్ఘ కాలంగా దూరంగా ఉండడం, కలిసి జీవించకపోవడం, అర్థవంతమైన బంధాలను తెంచుకుని జీవించే వాళ్లను హిందూ వివాహ చట్టం ప్రకారం కలిపి ఉంచలేమని కోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ: పెళ్లి చేసుకుని నాలుగేళ్లే కలిసి ఉంది ఓ జంట. ఆ తర్వాత 25 ఏళ్లు దూరంగా ఉన్నారు. తాజాగా ఆ జంట విడాకులు కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. ఆ కేసులో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిస్తూ ఆ మ్యారేజీని రద్దు చేసింది. ఆ జంటను ఒక్కటి చేయడం అంటే, అది వాళ్లకు క్రూరత్వాన్ని ప్రసాదించడమే అవుతుందని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
జస్టిస్ సుధాన్షు దులియా, జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది. దూరంగా ఉంటున్న ఆ జంట మధ్య ఉన్న బంధం.. హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వమే అని కోర్టు చెప్పింది. ఆ జంటకు పిల్లలు లేరని, వారి వైవాహిక బంధం బ్రేకైందని, దాన్ని రిపేర్ కూడా చేయలేమని కోర్టు పేర్కొన్నది.
ఆ ఇద్దరి మధ్య బంధం ముగిసిపోవాలని, ఎందుకుంటే వాళ్లను కలిపి ఉంచడం క్రూరత్వం అవుతుందని, సుదీర్ఘ కాలంగా దూరంగా ఉండడం, కలిసి జీవించకపోవడం, అర్థవంతమైన బంధాలను తెంచుకుని జీవించే వాళ్లను హిందూ వివాహ చట్టం ప్రకారం కలిపి ఉంచలేమని కోర్టు తెలిపింది.
ఆ జంటకు పిల్లలు లేరు కాబట్టి, వారిని విడదీయడం కేవలం వాళ్లకు మాత్రమే నష్టాన్ని మిగుల్చుతుందని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. భర్త నెలకు లక్షా ఆర్జిస్తున్నాడని, అయితే ఈ కేసులో భార్యకు నాలుగు నెలల్లోగా 30 లక్షలు చెల్లించాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.
1994లో ఆ జంట ఢిల్లీలో పెళ్లి చేసుకున్నది. అయితే తనకు చెప్పకుండా ఆమె అబార్షన్ చేయించుకున్నట్లు గతంలో భర్త ఆరోపించాడు. నాలుగేళ్ల తర్వాత ఇంటిని వదిలేసిన ఆ మహిళ.. గృహ హింస చట్టం కింద భర్తపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత భర్తను, అతని సోదరున్ని పోలీసులు అరెస్టు చేశారు.
బెయిల్పై వాళ్లు రిలీజయ్యారు. ఆ తర్వాత భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రయల్ కోర్టు డైవర్స్ మంజూరీ చేసినా.. ఢిల్లీ హైకోర్టు దాన్ని వ్యతిరేకించింది. దీంతో అతను మళ్లీ సుప్రీంకోర్టు సవాల్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

