సోమవారం 25 మే 2020
National - Apr 04, 2020 , 13:16:04

లాక్‌డౌన్‌.. వీడియో కాల్‌ ద్వారా వివాహం

లాక్‌డౌన్‌.. వీడియో కాల్‌ ద్వారా వివాహం

ముంబయి : కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కంటే ముందే నిర్ణయించిన పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. కానీ కొందరు తాము అనుకున్న ముహుర్తానికి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అది కూడా వీడియో కాల్‌ లేదా ఇతర యాప్‌ల ద్వారా వివాహం జరుపుకుంటున్నారు. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన మహమ్మద్‌ మీన్హాజుద్‌కు బీద్‌ యువతితో వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్‌ 3న వివాహం జరిపించాలని ఆర్నేళ్ల క్రితమే నిర్ణయించారు. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. చేసేదిమీ లేక వరుడి తండ్రి మహమ్మద్‌ గయాజ్‌ వీడియో కాల్‌ ద్వారా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాల్‌ ద్వారా నిఖా జరిపించి, ఆ జంటకు వివాహం చేశారు. ఈ కార్యక్రమానికి కేవలం ఇంటి సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తక్కువ ఖర్చుతో, సింపుల్‌గా వివాహం జరిగిపోయిందని ఇరు కుటుంబాలు పేర్కొన్నాయి.


logo