న్యూఢిల్లీ: రైల్వే కౌంటర్లో తీసుకున్న రైలు టిక్కెట్లను ఆన్లైన్లో రద్దు చేసుకోవచ్చునని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం పార్లమెంట్లో ప్రకటించారు. వెయిట్ లిస్టెడ్ పీఆర్ఎస్ కౌంటర్ టిక్కెట్లను రద్దు చేసుకోవడం కోసం ప్రయాణికులు ఇకపై రైల్వే స్టేషన్లకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు.
ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా లేదా 139 ఫోన్ నంబరుకు కాల్ చేసి టిక్కెట్‌ను రద్దు చేసుకోవచ్చునని తెలిపారు. డబ్బుల కోసం రైల్వే రిజర్వేషన్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఒరిజినల్ టిక్కెట్‌ను ఇచ్చి, డబ్బు తీసుకోవచ్చునని చెప్పారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.