(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్(నమస్తే తెలంగాణ): రాజస్థాన్లో తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ఒక్క పనీ చేయలేకపోయానని అటవీ శాఖ మంత్రి హేమారామ్ తన బాధ వెళ్లగక్కారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఓ గ్రామసభలో మాట్లాడుతూ నీటి పారుదల ప్రాజెక్టు టెండర్ల దగ్గరే ఆగిపోయిందన్నారు. తన గుడా మాలానీ నియోజకవర్గంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్, నర్మదా ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందిస్తానన్న హామీలు నెరవేర్చలేకపోయానన్నారు.