Cotton Candy Maggi | కాటన్ క్యాండీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే మ్యాగీ అంటే కూడా చాలామందికి ఇష్టం. మ్యాగీని ఎక్కువగా పిల్లలు ఇష్టపడుతుంటారు. కానీ.. కాటన్ క్యాండీని, మ్యాగీని రెండింటినీ కలిపితే ఎలా ఉంటుంది.. పోలా.. అదిరిపోలా అన్నట్టుగా టేస్ట్ ఉంటుంది అని ఈ వీడియో చూస్తేనే అర్థం అవుతోంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో ఇలాంటి వెరైటీ వంటకాలు ఫేమస్ అయ్యాయి. మ్యాగీతో కూడా వెరైటీ వంటకాలను చేశారు. ఒరియో పకోడీ, యాపిల్ పకోడీ, ఐస్ క్రీమ్ పానీపూరీ.. ఇలా వింత వింత వంటకాలను నెటిజన్లకు పరిచయం చేశారు. తాజాగా కాటన్ క్యాండీ మ్యాగీ ప్రిపరేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈట్ దిస్ ఢిల్లీ అనే ఇన్స్టా పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
ఫుడ్ బ్లాగర్ కాటన్ క్యాండీతో మ్యాగీని చేసి వెంటనే దాన్ని టేస్ట్ చేసి ఆ వీడియోను షేర్ చేసింది. కాటన్ క్యాండీ మ్యాగీ ట్రై చేశా. ఈ వంటకాన్ని స్వాగతిస్తారా? లేదా? అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. వావ్.. మీరు ప్రిపేర్ చేస్తుంటేనే నోరూరుతోంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.