న్యూఢిల్లీ, జూన్ 1: లోక్‌సభ చివరి విడత ఎన్నికల వేళ కేంద్రం శనివారం వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.69 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.1,676గా ఉన్నది.
మరోవైపు విమానయాన ఇంధన (ఏటీఎఫ్) ధర కిలో లీటర్‌కు రూ.6,673.87(6.5 శాతం) తగ్గింది. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతి నెల 1న అంతర్జాతీయ చమురు ధరలు, విదేశీ మారక రేటు సగటు ఆధారంగా ఏటీఎఫ్, వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి.