కరోనా ఘోరకలి

శ్మశానాలకు రోజూ వందల మృతదేహాలు
కిలోమీటర్ల మేర అంబులెన్సుల బారులు
ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక దృశ్యాలు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/భోపాల్: మరణించిన ఆత్మీయుల కడసారి చూపుకు నోచుకోని కుటుంబసభ్యులు ఒకవైపు, మృతదేహాలను తీసుకొచ్చి వంతుకోసం స్తబ్దుగా ఎదురుచూస్తున్న అంబులెన్సులు మరోవైపు, అంత్యక్రియలను జరిపేందుకు శ్మశానంలో జాగాలేక నిస్సహాయ స్థితిలో అధికారులు ఇంకోవైపు.. దేశంలో కరోనా సృష్టిస్తున్న ఘోరకలికి గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో కనిపిస్తున్న ఇలాంటి దృశ్యాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గుజరాత్‌లోని వడోదరా, సూరత్, అహ్మదాబాద్ తదితర నగరాల్లోని పలు శ్మశాన వాటికలు కరోనా మృతదేహాల గుట్టలతో నిండిపోతున్నాయి. ఒక్కో శ్మశాన వాటికకు రోజులో వందకుపైగా మృతదేహాలు వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొవిడ్ మృతులతో అంబులెన్సులు శ్మశానాల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరడం నిత్యకృత్యంగా మారుతున్నది. రోగులను తీసుకొచ్చే అంబులెన్సులతో గుజరాత్‌లోని దవాఖానలు రద్దీగా మారాయి. ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. నగరంలోని ప్రధాన శ్మశాన వాటికల్లో రోజుకు సగటున గరిష్ఠంగా 50-60 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించగలమని, అయితే ప్రస్తుతం రోజూ వందకు పైగా మృతదేహాలు వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు స్థానిక యంత్రాంగం చెబుతున్నది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌తో పాటు పలు ప్రాంతాల్లోని శ్మశానాలకు కరోనా మృతదేహాలు పోటెత్తుతుండటంతో జాగా లేక అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

