పాట్నా: దివ్యాంగుడైన వ్యక్తిని పోలీసులు కర్రలతో దారుణంగా కొట్టారు. అతడిపై అకారణంగా దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. (Cops Suspended) హోంగార్డులను విధుల నుంచి తొలగించారు. బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సమేలిలోని చోహార్ గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి రోడ్డుపై కూర్చొన్నాడు. అక్కడ పార్క్ చేసిన పోలీస్ వాహనానికి అతడు ఆనుకున్నాడు.
కాగా, ఇది చూసి పోలీసులు ఆగ్రహించారు. జనం చూస్తుండగా దివ్యాంగుడైన ఆ వ్యక్తిపై అకారణంగా దాడి చేశారు. కర్రలతో కాళ్లు, చేతులపై దారుణంగా కొట్టారు. ఆ వ్యక్తిని అక్కడి నుంచి పక్కకు ఈడ్చుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఈ సంఘటనపై కతిహార్ ఎస్పీ స్పందించారు. పోథియా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ కేదార్ ప్రసాద్ యాదవ్, కానిస్టేబుల్ ప్రీతి కుమారిని సస్పెండ్ చేశారు. హోంగార్డులు సికందర్ రాయ్, కిషోర్ మహతోను ఏడాది పాటు విధుల నుంచి తొలగించారు. దివ్యాంగుడ్ని దారుణంగా కొట్టిన డ్రైవర్ బంబం కుమార్‌పై కేసు నమోదు చేశారు.
Shame on Katihar Police: A tribal youth was forced to lie on the road & brutally beaten. @bihar_police, we demand a full investigation & accountability for this inhumane act. @SpKatihar, please act now to restore public trust.@DM_Katihar @NitishKumar @yadavtejashwi @IPRDBihar pic.twitter.com/6PQRnAfvoP
— संतोष कुमार 𝕏 (@isantoshrajak) February 27, 2025